Rishabh Pant convinces Virat Kohli to take review | Oneindia Telugu

2021-08-04 409

India Vs England 1st Test : Rishabh Pant convinces Virat Kohli to take review, India skipper relieved after getting it right
#ViratKohli
#Rishabhpant
#Teamindia
#Indvseng
#MsDhoni

డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్‌ఎస్) అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. వికెట్ల వెనుక నుంచి బంతి గమనాన్ని నిశితంగా పరిశీలించే ధోనీ.. డీఆర్‌ఎస్ తీసుకున్నాడంటే అది దాదాపు సక్సెస్ అయినట్టే. ధోనీ డీఆర్ఎస్ తీసుకుంటే క‌చ్చితంగా భార‌త్‌కు అనుకూలంగా వ‌స్తుంద‌ని అభిమానులు కూడా న‌మ్ముతారు. అంపైర్లు కూడా మహీ నిర్ణయంతో ఏకీభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ధోనీ లేక‌పోవ‌డం వ‌ల్ల టీమిండియాకు డీఆర్ఎస్ విష‌యంలో చాలా ఇబ్బంది క‌లుగుతోంది. ఈ విష‌యంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నమ్మకం పెట్టుకుంటే.. ఒక్కోసారి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని భారత కామెంటేటర్ చెప్పాడు.